Kishan Reddy: రైతులకు సరిపడా ఎరువులు ఇస్తున్నాం
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:11 AM
2024-25 రబీ సీజన్‌లో రైతులకు లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువులను సరఫరా చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 12.02 లక్షల టన్నులను సరఫరా చేయడంతో రాష్ట్రంలో ఇంకా 1.68 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయి

తెలంగాణ సహా దేశమంతా మిగులు నిల్వలు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 2024-25 రబీ సీజన్‌లో రైతులకు లోటు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎరువులను సరఫరా చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఎరువులను సరఫరా చేయగా, అవసరాలు తీరిపోను, ఇంకా రాష్ట్రా ల వద్ద మిగులు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి పంట కాలం మొదలయ్యే ముందుగా అన్ని రాష్ట్రాల రైతులకు అవసరమైన మొత్తంలో ఎరువులు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు 2024-25 రబీ సీజన్‌లో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, కేంద్ర ప్రభుత్వం 12.02 లక్షల టన్నులను సరఫరా చేసిందని తెలిపారు. రైతులకు అమ్మగా రాష్ట్రం వద్ద ఇంకా 1.68 లక్షల టన్నుల యూరియా ఉందని చెప్పారు.