రంగుల హరివిల్లు
ABN , Publish Date - Jan 06 , 2025 | 02:14 AM
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ హై స్కూల్ వేధికగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సేల్ వారి సెల్సి యా ట్రెండీ వుమెన్స్, క్రాఫ్ట్ వారి ఫర్‌ఫెక్ట్, స్థానిక పార్ట్‌నర్ జ్యోతి హైస్కూల్, మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సహకారాలతో ఘనంగా జరిగాయి.
జగిత్యాలలో ఘనంగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 172 మంది మహిళలు
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, అద నపు కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్
జగిత్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ హై స్కూల్ వేధికగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సేల్ వారి సెల్సి యా ట్రెండీ వుమెన్స్, క్రాఫ్ట్ వారి ఫర్‌ఫెక్ట్, స్థానిక పార్ట్‌నర్ జ్యోతి హైస్కూల్, మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సహకారాలతో ఘనంగా జరిగాయి. జిల్లా న లుమూలల నుంచి 172 మంది మహిళలు, విద్యార్థినులు హాజరై అవనికి రంగులు అద్దారు. పట్టణంలోని సూర్య గ్లోబల్ హై స్కూల్ ఆవరణలో జరి గిన పోటీల్లో మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. విజేతలకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత, జ్యోతి, సూర్య, మానస ఎక్స్‌లెన్స్ పాఠశాలల డైరెక్టర్లు బోయినిపల్లి శ్రీధర్‌రావు, హరిచరణ్ రావు, అజిత రావు, మానస ఎక్స్‌లెన్స్ ప్రిన్సిపాల్ బోయినిపల్లి రజితరావులతో కలిసి బహుమ తులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద జోడు దుర్గ భవానీ రూ.6 వేలు, రెండవ బహుమతి కింద తుమ్మనపల్లి అనీలకు రూ.4 వేలు, మూడవ బహుమతి కింద నీలం అనూష రూ. 3 వేలను అందజేశారు. జగిత్యాలకు చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంటాల శ్రీనివాస్, ప్రముఖ వ్యాపార సంస్థ ఆనంద్ షాపింగ్ మాల్, ఎల్‌వీఆర్ షోరూం 172 మందికి కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా పా ఠశాల డైరెక్టర్ రజితారావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ ముక్క వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. రిపోర్టర్లు మురళీ, రాములు, రాజన్న, స్వామి గౌడ్, శాంతపురావు, వేణుగోపాల్, రిపోర్టర్ పురుషోత్తం, బి.మల్లేశం, ప్రదీప్, గంగాధర్, సంతోష్, సుధన్, గణేష్, రమేశ్, శ్రీమాన్, ఏబీ ఎన్ కెమెరామెన్లు శ్రీనివాస్, ఏడీవీటీ ఇన్‌చార్జిలు రాజు, సర్క్యూలేషన్ ఇన్‌చార్జి ప్రశాంత్, నాయకులు గంప శ్రీనివాస్, గుంటుక మహేశ్ పాల్గొని కన్సొ లేషన్ బహుమతులను అందజేశారు.