ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:09 PM
పకడ్బందీ ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పకడ్బందీ ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి అద నపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వ ర్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 19.03.2025 వరకు ఆన్‌లైన్‌లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజక వర్గాల్లో 6,7,8 ఫారం 5,481 దరఖాస్తులు వచ్చాయన్నారు. 4,559 దరఖాస్తులను పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు. వివరాలు సరిగ్గా లేని 369 తిరస్కరించినట్లు తెలిపా రు. 553 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామ న్నారు. రాజకీయ పార్టీలు స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. సమావేశంలో సంబం ధిత అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.