శనివారం, ఆదివారం, సోమవారం వరసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వచ్చాయి. దీంతో పాఠశాల అన్ని గదులు సహా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండే పాత్రలు ఉన్న గదికి సైతం తాళాలు వేశారు సిబ్బంది.
చిన్న నిర్లక్ష్యంతోనే పెద్దపెద్ద ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేసవికాలం వచ్చిందంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఆకులు, గడ్డి పొదల్లో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేసి వదిలేసిన బీడీ, సిగరెట్లే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
పార్టీలు మారడం కాదు ప్రజలకు ఎంత వరకు మంచి చేశామనేదే ముఖ్యమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు.
ప్రాణహిత ప్రాజెక్టును పునఃర్నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నిర్మించడం చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వదిలేసిందని, రూ. లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకలిందని డిప్యూటి సీఎం అన్నారు.
వ్యవసాయమే ప్రధాన జీవనధారమైన జిల్లాలో పంటలపై రోజురోజుకు సాగు భారం ఎక్కువ అవుతున్నది. యేటా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నదాతలు ఽఆందోళనకు గురవుతున్నారు.
జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల సమీపంలోని విశ్రాంత ఉద్యోగిని కొలిపాక వరలక్ష్మి నివాసంలో బుధవారం చోరీ జరిగింది.
వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తా సూచించారు.
జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్య, వైద్య, ఆరోగ్య, రవాణా, ఆర్టీసీ, విద్యుత్, గ్రామీణనీటి సరఫరా, తపాల శాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సంప్రదాయ పంటలైన వరి, పత్తి తదితరాలు సాగు చేసి దిగుబడులు రాక నష్టపోతున్న రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే రోజువారీ ఆదాయం లభించే కూరగాయల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు.
మాతాశిశు సంరక్షణ కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని సిబ్బందికి డీఎంహెచ్వో డాక్టర్ హరీశ్ రాజు సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని భగవంత్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం సమీక్షాసమావేశం నిర్వహించారు.