Share News

మహిళా సాధికారతే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:11 PM

మహిళా సాధికారతే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని, జిల్లాలోని లింగాపూర్‌ మండలం చోర్‌పల్లి గ్రామంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిరా ఫెల్లోషిప్‌ తెలంగాణ రాష్ట్ర బూత్‌ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని శక్తి అభియాన్‌, ఇందిరా ఫెల్లో షిప్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభ కోఆర్డినేటర్‌, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ తెలిపారు.

మహిళా సాధికారతే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ

- 22, 23 తేదీల్లో ఇందిరా ఫెల్లోషిప్‌ క్యాంపు

- కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని, జిల్లాలోని లింగాపూర్‌ మండలం చోర్‌పల్లి గ్రామంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఇందిరా ఫెల్లోషిప్‌ తెలంగాణ రాష్ట్ర బూత్‌ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని శక్తి అభియాన్‌, ఇందిరా ఫెల్లో షిప్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభ కోఆర్డినేటర్‌, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరవుతారన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం, రాజకీయాలు, పాలనలతో సహా ప్రతి రంగంలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి భారత జాతీయ కాంగ్రెస్‌ ఇందిరా ఫెల్లోషిప్‌ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీనిని రాహుల్‌ గాంధీ అక్టోబరు 14, 2023న తొలిసారిగా ప్రారంభిం చారని తెలిపారు. ఈ కార్యక్రమం లక్ష్యం మహిళల ను రాజకీయాల్లోకి తీసుకురావడం, ప్రతిరంగం లోనూ తమదైన ముద్ర వేయడానికి వీలుగా నాయ కత్వ లక్షణాల కోసం శిక్షణ ఇవ్వడమని తెలిపారు. మహిళా సాధికారత కోసం మహిళలందరు ఇందిరా ఫెల్లో షిప్‌లో చేరాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యలు కళావతి, యశోద, ప్రతిభ, విజయ, రాజేశ్వరి, పద్మ, శంకరమ్మ, రేణుక, సుఽధాక ర్‌, భీంరావు, శ్యాం, తిరుపతి, గంగారాం, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:11 PM