Akbaruddin Owaisi: కొత్త గురుకులాలపై స్పష్టత ఇవ్వాలి: అక్బరుద్దీన్
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:47 AM
కొత్తగా నిర్మిస్తోన్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

కొత్తగా నిర్మిస్తోన్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను అలాగే కొనసాగిస్తారా లేక యంగ్ ఇండియా సమీకృత గురుకులాల్లో విలీనం చేస్తారా అనే విషయంపై ఇంతవరకు స్పష్టత లేదన్నారు. కొత్తగా రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేస్తే ఇప్పటికే గత ప్రభుత్వ హయంలో లబ్ధిదారుడని, అనర్హుడిగా ప్రకటిస్తూ అప్లికేషన్ తిరస్కరణకు గురి అవుతోందంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. జాబ్ కేలండర్ మాదిరిగానే ఓవర్సీస్ కేలండర్‌ను విడుదల చేయాలన్నారు.