Home » Akbaruddin Owaisi
గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది ‘కచరా’ పాలన అని.. పదేళ్లపాటు ఎంజాయ్ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, ఏడు తరాలకు సరిపడా సంపాదించారని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ధరణిని ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆయన ఆరోపించారు.
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిని నిరసిస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ప్రజల కోసం పోరాడుతున్నారా ? లేకపోతే కుటుంబం కోసం పోరాటం చేయడానికి వచ్చారా? అని విరుచుకుపడ్డారు. అందినకాడికి దోచేశారని..
హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి.
‘‘పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై మండిపడ్డారు.
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, లేదంటే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ పే రులో ప్రొహిబిషన్ పదాన్ని తొలగించాలని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. మద్యపానాన్ని నిషేధించాలనే చిత్తశుద్ధి లేనప్పుడు శాఖ పేరులో ‘ప్రొహిబిషన్’ అనే పదం ఎందుకని ప్రశ్నించారు.
‘‘మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పాతబస్తీలో మెట్రో నిర్మాణాన్ని చేపడతాం. 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీ నుంచి ప్రతీ సంక్షేమ పథకం లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చెయ్యకుండా పథకాలు అమలు చేయడమేంటనీ ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రశ్నించారు.
హైదరాబాద్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ, నాలుగుసార్లు ఓటమి ఎరుగని నేతగా.. హైదరాబాద్(Hyderabad) ఎంపీగా విజయాలు అందుకున్న అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ ఎన్నికల్లో భయపడుతున్నారా?
Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.