Share News

SriSailam Project : ఏపీ సరిహద్దులో శిథిలావస్థకు చేరిన శ్రీశైలం రోడ్డు వంతెన

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:11 AM

ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీశైలం రోడ్డు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన నిర్మాణానికి అప్పటి దేశ ప్రధానమంత్రి నెహ్రు 1963 జూలై

 SriSailam Project : ఏపీ సరిహద్దులో శిథిలావస్థకు చేరిన శ్రీశైలం రోడ్డు వంతెన

వాహనాల రాకపోకలతో వంతెనలో కదలికలు

కూలిపోతున్న వంతెన సైడ్‌వాల్‌

పట్టించుకోని ఎన్‌హెచ్‌ఏ అధికారులు

దోమలపెంట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీశైలం రోడ్డు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన నిర్మాణానికి అప్పటి దేశ ప్రధానమంత్రి నెహ్రు 1963 జూలై 24న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం పీవీ నర్సింహారావు 1972 మే 1న వంతెనను ప్రారంభించారు. అదే సమయంలో శ్రీశైలం డ్యాం నిర్మాణం కోసం వాహనాల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడింది. శ్రీశైలం వంతెనపై 10 టన్నులకు మించి బరువు కలిగిన వాహనాలకు అనుమతి లేదని రవాణాశాఖ అధికారులు నిబంధనలు విధించినా వాహనదారులు లెక్క చేయకపోవడంతో వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. వందేళ్ల దాకా ఉపయోగించుకోవాలని నిర్మించిన వంతెన 50 ఏళ్లకే శిథిలావస్థకు చేరిందని దోమలపెంట, ఈగలపెంట, సుండిపెంట గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న సైడ్‌వాల్‌ పడిపోయింది. శిథిలావస్థకు చేరిన శ్రీశైలం వంతెనకు మరమ్మతులు చేయడంతో పాటు మరో నూతన వంతెన నిర్మించాలని స్థానికులతో పాటు శ్రీశైలం వచ్చే భక్తులు కోరుతున్నారు. జాతీయ రహదారి పరిధి ఎడమ పాతాలగంగ శ్రీశైలం వంతెనలో కొద్ది దూరం మాత్రమే ఉన్నందున వంతెన నిర్వాహణ ఆంధ్ర ప్రాంతం రహదారి అధికారులు చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏ కల్వకుర్తి డివిజన్‌ డీఈ రమేశ్‌ చెప్పారు.

Updated Date - Jan 08 , 2025 | 04:11 AM