Share News

అంకుర సంస్థకు స్టార్టప్‌ మహారథి అవార్డు

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:39 AM

ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న స్టార్టప్‌ మహాకుంభ్‌ కార్యక్రమంలో శనివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ సంస్థ సీఈవో జగన్‌మోహన్‌రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

అంకుర సంస్థకు స్టార్టప్‌ మహారథి అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కు చెందిన అంకుర సంస్థ యూఆర్‌ అడ్వాన్స్డ్‌ థెరప్యూటిక్స్‌ ఢిల్లీలో జరిగిన ‘‘స్టార్ట్‌ప-మహారథి’’ పోటీలో బయోటెక్నాలజీ, ఆరోగ్య రంగంలో పురస్కారాన్ని గెలుచుకుంది. ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న స్టార్టప్‌ మహాకుంభ్‌ కార్యక్రమంలో శనివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ సంస్థ సీఈవో జగన్‌మోహన్‌రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేశారు.


స్టార్టప్‌ మహాకుంభ్‌లో కృత్రిమ మేథ, డీప్‌ టెక్‌, జీవ సాంకేతిక పరిజ్ఞానం, సైబర్‌ భద్రత, ఆర్థిక-సాంకేతిక పరిజ్ఞానం, గేమింగ్‌, రక్షణరంగం, అంతరిక్షరంగం, ఇంధనం-వాతావరణ పరిజ్ఞానం, కచ్చితత్వ తయారీ తదితర రంగాల నుంచి ఆయా అంకుర పరిశ్రమలు తమ లక్ష్యాలను వివరిస్తూ తమ ఉత్పత్తులను, సేవలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్టార్టప్‌ మహారథి పోటీలో మొత్తం పది రంగాల్లో, ఒక్కో రంగం నుంచి టాప్‌-5 విజేతలను ప్రకటించగా జీవ సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్యరంగంలో ఆవిష్కరణలకు గానూ యూఆర్‌ అడ్వాన్స్డ్‌ థెరప్యూటిక్స్‌ ఐదో స్థానంలో నిలిచి పురస్కారాన్ని అందుకుంది.

Updated Date - Apr 06 , 2025 | 04:39 AM