Share News

Kalvakuntla Kavitha: పవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ: కవిత

ABN , Publish Date - Mar 20 , 2025 | 06:20 AM

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Kalvakuntla Kavitha: పవచనాలు ఎక్కువ.. పైసలు తక్కువ: కవిత

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రభుత్వం రూ.30వేలకోట్లు అప్పు కట్టినట్టు చెబుతుండగా.. సీఎం రేవంత్‌ లక్షానలభై వేల కోట్లు అప్పులు కట్టామని చెబుతున్నారంటే అంతా అబద్ధమని తేలిపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ రూ.4లక్షల 37వేలకోట్లు అప్పు చేస్తే.. రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రచారం చేశారని మండిపడ్డారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. పరిపాలన చేతగాక కాంగ్రెస్‌ నేతలు పలాయన వాదం ఎంచుకున్నారని విమర్శించారు. ఎల్‌.రమణ మాట్లాడుతూ.. చేతగాని పాలనకు ఈ బడ్జెట్‌ నిదర్శనమన్నారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇది దగాకోరు దగుల్బాజీ బడ్జెట్‌ అని అన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 06:20 AM