Home » Kalvakuntla kavitha
అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఈ నెల 11న ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
విద్యారంగంపై కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ‘ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదని, దమ్ముంటే బీసీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సవాల్ విసిరారు.
‘‘జూపల్లి కృష్ణారావు ముందు నియోజకవర్గానికి రావాలి. ఆయన టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్టు మంత్రిలా వ్యవహరిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి, ఆయన తరఫున వాదించిన న్యాయవాది సంజీవరెడ్డి, డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు.
తెలంగాణలో దస్ పర్సంటేజ్ సర్కార్ నడుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, పర్సంటేజీల పాలన నడుస్తోందని, పర్సంటేజీలు ఇచ్చిన వారికే బిల్లులు మంజూరవుతున్నాయని ఆమె ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కుమార్ తమ్ముడు అరుణ్‌కుమార్ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు అందింది.
కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ ముగ్గురూ కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒకే బిల్లు ప్రవేశపెడితే సరిపోదని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలకు వేర్వేరుగా మూడు బిల్లులు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.