Share News

Betting Apps: పోలీస్ అయిఉండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. ఊహించని షాక్..

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:21 PM

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న.. చేసిన వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత శాఖలో ఉన్నవారైనా సరే.. వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది.

Betting Apps: పోలీస్ అయిఉండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. ఊహించని షాక్..
Betting Apps

మలయాళంలో సూపర్ హిట్ అయిన రేఖ చిత్రం అనే సినిమాలో హీరో బెట్టింగ్ ఆడి లక్షలు గెలుస్తాడు. ఈ విషయం అధికారులకు తెలిసి కొన్ని నెలలు సస్పెండ్ చేస్తారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు సాధారణ జనం కూడా అతడ్ని వింతగా చూస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నిజ జీవితంలోనూ ఓ కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఇప్పుడు ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది. హబీబ్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అది కూడా యూనిఫామ్ వేసుకుని మరీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అంతటితో ఆగకుండా టెలిగ్రామ్ ఛానల్‌లో బెట్టింగ్ యాప్స్ టిప్స్ కూడా చెప్పటం మొదలెట్టాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. కిరణ్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపాదం..

తెలంగాణ పోలీసు శాఖ బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్స్‌ఫ్యూఎన్సర్లపై కేసులు నమోదు చేస్తోంది. తాజాగా 11 మంది ఫేమస్ సెలెబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. హర్షసాయి, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత,హర్ష సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజలపై పోలీసు కేసు నమోదైంది. వీరందరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలియరావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో సజ్జనార్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ట్విటర్ ద్వారా అందరి గుట్టు బయటపెడుతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం హర్షసాయికి సంబంధించిన ఓ వీడియోను తన అకౌంట్లో పెట్టారు. హర్షసాయిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఎవ్వరినీ వదలం: డీసీపీ

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సంచలన కామెంట్లు చేశారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్‌పై ఓ సిటిజన్ ఫిర్యాదు చేశారని, ఆ కేసు మేరకు మెుత్తం 11 మంది ఇన్స్‌ఫ్యూఎన్సర్లపై క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నామన్నారు. ఏఏ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎలాంటి వీడియోలు పెట్టారనే అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Justice Nagesh: రూ.కోటి ఫైన్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Crime News; కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

For More AP News and Telugu News

Updated Date - Mar 18 , 2025 | 04:22 PM