Share News

సీఎం సహాయనిధి పేదలకు భరోసా

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:46 PM

ముఖ్యమంత్రి సహా యనిధి నిరు పేదలకు భరోసా కల్పిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు భరోసా
బాధితునికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

చారకొండ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) ముఖ్యమంత్రి సహా యనిధి నిరు పేదలకు భరోసా కల్పిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని శేరిఅప్పారెడ్డిపల్లి పడమటితండాకు చెందిన కొర్రవత్‌ కోమిటి అనారోగ్యంతో హైదరాబా ద్‌లో ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సీఎం సహా య నిధికోసం ఆమె దరఖాస్తు చేసుకోగా రూ. 60వేలు మంజూరవగా, ఆ చెక్కును ఆదివారం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు.

ఫ మండలంలోని జూపల్లి గ్రామానికి చెం దిన మణెమ్మకు రూ. 60 వేలు, చిట్టికి 16,500, గెల్వయ్యకు రూ. 18 వేలు, బుచ్చాలుకు రూ. 26వేలు ఎమ్మెల్యే కృషి వల్ల మంజూరైన సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలాది బాలరాజు, నాయకులు బాధి తులకు అందజేశారు. కార్యక్రమంలో జూపల్లి రాములుయాదవ్‌, సురేస్‌, రాములు, కుమార్‌ సింగ్‌, గోపి, దేవేందర్‌, గోపాల్‌, లక్ష్మణ్‌, రవి, జంగయ్య, ఎండీ మహమ్మద్‌, సంజీవ, నిరంజన్‌, శ్రీను, జంగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:46 PM