Share News

CM Revanth Reddy: అద్భుత విజయం.. అభినందనలు: సీఎం

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:06 AM

సివిల్స్‌కు ఎంపికై సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలవారికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ యువత అత్యుత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

CM Revanth Reddy: అద్భుత విజయం.. అభినందనలు: సీఎం

‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ కింద సాయం.. ఏడుగురికి ర్యాంకులు

సివిల్స్‌కు ఎంపికై సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలవారికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ యువత అత్యుత్తమ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. దేశసేవలో పాలుపంచుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని సాధించారని ప్రశంసించారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకం కింద.. ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థికసాయం అందించిన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురు అభ్యర్థులు క్వాలిఫై కావడం విశేషం.


ఆ ఏడుగురూ.. 11వ ర్యాంకర్‌ సాయిశివాని, హరిప్రసాద్‌ పోతరాజు (255), ప్రీతి రాపర్తి (451), నాగరాజ నాయక్‌ బానోతు (697), సూర్యతేజ తొగరు (799), ఆంజనేయులు గోకమల్ల (934), రాంటెంకి సుధాకర్‌ (949). జాతీయస్థాయి పరీక్షలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం కొనసాగిస్తుందని ఈసందర్భంగా సీఎం తెలిపారు. కాగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ ఛైర్మన్‌ ఎన్‌.బలరామ్‌ కూడా సివిల్స్‌ ర్యాంకర్లకు అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 23 , 2025 | 04:06 AM