కొండగట్టుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల పాదయాత్ర
ABN , Publish Date - Jan 06 , 2025 | 02:12 AM
తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్రశిక్ష ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరవై అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్నాలో భాగంగా ఉమ్మడి కరీనంనగర్ జిల్లాకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదివారం జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు మహాపాదయాత్ర నిర్వహించారు.
ఫ అంజన్న ఆలయంలో డిమాండ్ల అమలుకు పూజలు
మల్యాల, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్రశిక్ష ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరవై అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్నాలో భాగంగా ఉమ్మడి కరీనంనగర్ జిల్లాకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదివారం జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించేలా చూడాలని స్వామి వారికి పూజలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని స్వామి అంజన్నకు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్లా, పెద్దపెల్లి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులు మహాపాద యాత్రలో పాల్గొన్నారు