Share News

నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుపై సందిగ్ధం

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:43 AM

రాష్ట్రంలో 100 పడకల దవాఖానా ఉన్న ప్రతి చోట నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని గతే డాది జనవరి 2న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నాగార్జునసాగర్‌లో కూడా కమలా నెహ్రూ దవా ఖానాకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల ఏర్పా టవుతుందని స్థానికులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఏడాది గడుస్తున్నా నేటికీ నర్సింగ్‌ కళాశాలల ఊసే ప్రభుత్వం ఎత్తకపోవ డంతో సంది గ్ధం పరిస్థితి నెలకొంది. (నాగార్జునసాగర్‌ -ఆంధ్రజ్యోతి)

 నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుపై సందిగ్ధం

నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో డ్యామ్‌ నిర్మాణ సమయంలో ఇక్కడ పనిచేసే ఉద్యోగుల, కూలీల కోసం ఆరు దశాబ్దాల క్రితం నాటి ప్రధాని నెహ్రూ సతీమణి పేరున కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రి నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, వరంగల్‌, మహాబూబ్‌నగర్‌, ప్రకాశం తదితర జిల్లాల నుంచి వచ్చి రోగు లు వైద్యం చేయించుకునే వారు. అలాగే ఈ ఆసుపత్రిలో 1992వ సంవత్సరంలో వితంతువులు, అనాథ మహిళలకు ఉపాధి కోసం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేసి నిర్వహించారు. ఈ కళాశాలలో సంవత్సరానికి 30 సీట్ల చొప్పున మహిళలకు నర్సింగ్‌ విద్యను అందించేవారు. అనంతరం కళాశాలలో సిబ్బంది తదితర సమస్యలతో మూడేళ్ల తర్వాత కళాశాలను తీసివేశారు. దీంతో అప్పటి నుంచి ఈ ప్రాంత మహిళలు, బాలికలునర్సింగ్‌ విద్య కోసం హైదరాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట వరంగల్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే పాత ఆసుపత్రి భవనం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో రూ.18 కోట్లతో నూతన ఆసుపత్రి భవనాన్ని 2019లో నిర్మించారు. అప్పటి నుంచి కొత్త భవనంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. పాత ఆసుపత్రి భవనం నిరుయోగంగా ఉంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాత ఆసు పత్రి భవనంలో నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సాగర్‌లో నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల మధ్యలో విద్య మానేసిన మహిళలకు చదువుకునే అవకాశం లభించడమే కాకుండా వారికి ప్రభుత్వ పరంగానో లేదా ప్రైవేటు పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ నర్సింగ్‌ కళాశాలలో పనిచేసిన నలుగురు నర్సింగ్‌ ట్యూటర్లు ప్రస్తుతం కూడా సాగ ర్‌ ఆసుపత్రి నుంచే వేతనాలు తీసుకుంటున్నారు. సాగర్‌ నుంచి వేతనం పొందుతూ హైదరాబాద్‌లో ఉస్మా నియా ,గాంధీ, నీలోఫర్‌ దవాఖానాల్లో కళాశాలలో డిప్యూటేషన్‌పై ట్యూటర్లుగా పనిచేస్తున్నారు.

64 నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుకు ఆదేశాలు...

రాష్ట్రంలో నర్సుల కొరత నేపఽథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో 64 నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉన్న ప్రతి చోట నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఆలోచిస్తుంది. దీంతో సాగర్‌ హిల్‌కాలనీలో కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి పాత భవనంలో గతంలో మాదిరిగా నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటవుతుందని స్థాని కులు ఆశిస్తున్నారు.సాగర్‌ చుట్టు పక్కల ఉన్న సుమారు 35 తండాలకు చెందిన కృష్ణపట్టె పరిఽధిలో గిరిజన యువతులు విద్యార్థినుల్లో తాము నర్సింగ్‌ విద్యను అభ్యసి ంచే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వెంటాడుతున్న నర్సుల కొరత

కొవిడ్‌ సమయంలో నర్సులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వంద పడకల ఆసుపత్రిలో 45 మంది నర్సులు ఉండాలి. కానీ ప్రస్తుతం 25 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 ప్రభుత్వ, 78 వరకు ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలు ఉండగా మొత్తం 3,150 నర్సింగ్‌ సీ ట్లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Jan 11 , 2025 | 12:43 AM