Share News

Koonaneni: అన్యాక్రాంత భూముల లెక్కలేవి?: కూనంనేని

ABN , Publish Date - Mar 22 , 2025 | 03:49 AM

భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్లు సేకరించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Koonaneni: అన్యాక్రాంత భూముల లెక్కలేవి?: కూనంనేని

భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్లు సేకరించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్‌ మాఫియా ఆక్రమణల్లో ఉన్న భూములను విడిపించి వాటిని అమ్మడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. 400 ఎకరాల భూముల అమ్మకంలో హెచ్‌సీయూకి చెందిన భూములూ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.


జీవో 59ని పూర్తిగా అమలు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, జీవో 58 పేదలకు ఉపయోగపడుతుందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించాలన్నారు. రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేయడం చిన్న విషయం కాదని, అయితే అనేక గ్రామాల్లో ఆధార్‌కార్డు సమస్యల వల్ల రుణమాఫీ పూర్తిగా జరగలేదని ఓ ఉదాహరణను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. సింగరేణిలో బొగ్గు తీసే పని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఇది సరైన నిర్ణయం కాదని కూనంనేని అన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 03:49 AM