Share News

క్రికెట్‌ టోర్నీ విజేత అచ్చంపేట

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:47 PM

అ పోలో టోటల్‌ హెల్త్‌ సంస్థ ఆధ్వర్యంలో అమ్రా బాద్‌ మండలం మన్ననూరు చింతల చెరువు క్రీడా మైదానంలో వారం రోజులుగా జరుగు తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ఆది వారం విజయవంతంగా ముగిసాయి.

క్రికెట్‌ టోర్నీ విజేత అచ్చంపేట
విజేతగా నిలిచిన అచ్చంపేట జట్టుకు కప్పును అందజేస్తున్న అపోలో సంస్థ ప్రతినిధులు

మన్ననూర్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : అ పోలో టోటల్‌ హెల్త్‌ సంస్థ ఆధ్వర్యంలో అమ్రా బాద్‌ మండలం మన్ననూరు చింతల చెరువు క్రీడా మైదానంలో వారం రోజులుగా జరుగు తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ఆది వారం విజయవంతంగా ముగిసాయి. లీగ్‌ స్థాయిలో మాచ్‌లను నెగ్గి ఫైనల్‌కు చేరిన ప్రే మ్‌ క్రికెట్‌జట్టు అచ్చంపేట, దండోరా క్రికెట్‌ జ ట్టు అమ్రాబాద్‌ల మధ్యన హోరా హోరీగా జరి గిన మ్యాచ్‌లో అచ్చంపేట జట్టు విజయం సా ధించి కప్పును కైవసం చేసుకుంది. రన్నరప్‌గా దండోరా అమ్రాబాద్‌ జట్టు నిలిచింది. విజేతగా నిలిచిన జట్టు రూ.2000, రన్నరప్‌ జట్టుకు రూ.10000 నగదును అందజేశారు. టోర్నమెం ట్‌లో 36 జట్లు పాల్గొనగా, లాటరీ ద్వారా 8 జ ట్లను ఎంపిక చేసి క్రికెట్‌ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో అపోలో టోటల్‌ హెల్త్‌ మేనే జ రు హరిబాబు, అపోలో ఎగ్జిక్యూటివ్‌ జావేద్‌, అ పోలో వైద్యాధికారి డాక్టర్‌ రాజశేఖర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ బుచ్చయ్య, ఎంపీటీసీ మాజీ స భ్యులు దాసరి శ్రీనివాసులు, బాలమ్మ, కాంగ్రెస్‌ నాయకులు రహీం, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:47 PM