David Warner: హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్.. మ్యాచ్ కోసం కాదు సుమా.. అతగాడి పని వేరే
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:23 PM
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే మ్యాచ్ కోసం కాదు. వార్నర్ రాబిన్‌హుడ్ అనే తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చాడు.

ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఐపీఎల్ 18 వ సీజన్ శనివారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఐపీఎల్ అంటేనే స్వదేశి, విదేశి ఆటగాళ్ల సమాహారం. ఐపీఎల్ పుణ్యమా అని ఇండియన్ క్రికెటర్లు మాత్రమే కాక.. విదేశీ ఆటగాళ్లు కూడా భారతీయ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ప్లేయర్స్ జాబితాలో చేరారు. వారిలో ముందు వరుసలో వచ్చే పేరు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. మైదానంలోనే కాక.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు వార్నర్. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగ్స్‌కు తగ్గట్టుగా వీడియోలు చేసి నెట్టింట షేర్ చేస్తూ.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆయనను కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం వార్నర్ ఐపీఎల్ ఆడటం లేదు. మరి హైదరాబాద్ ఎందుకు వచ్చాడంటే..
డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రాకకు కారణం మూవీ ప్రమోషన్స్. అవును.. ప్రస్తుతం వార్నర్ నితిన్ హీరోగా వస్తోన్న రాబిన్‌హుడ్ సినిమాలో నటించాడు. ఈ మూవీలో వార్నర్.. డేవిడ్ పాత్రలో యాక్ట్ చేశాడు. నేడు అనగా ఆదివారం నాడు రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిలో పాల్గొనడం కోసం డేవిడ్ వార్నర్ హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.
గత కొన్నాళ్లుగా.. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ మీద సరదా వీడియోలు చేస్తూ.. నెట్టింట షేర్ చేస్తూ.. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు వార్నర్. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాబిన్‌హుడ్ టీమ్ వార్నర్‌ని ఈ చిత్రంలోకి తీసుకుంది. దీనిపై నితిన్ మాట్లాడుతూ.. ’రాబిన్‌హుడ్ సినిమాలో వార్నర్ పాత్ర ఎంతో ప్రత్యేకం. మూవీ ప్రారంభం నుంచి డేవిడ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు.. మా డైరెక్టర్ వెంకీ ఆ పాత్రకు క్రికెటర్ వార్నర్‌ని తీసుకుంటే బాగుటుందని సూచించారు. ఆయన ఆలోచన మాకు కూడా నచ్చడంతో వెంటనే వార్నర్‌ని సంప్రదించాము. వార్నర్‌కు ఈ రోల్ గురించి చెప్పాము. విన్న వెంటనే ఆయన మా సినిమాలో యాక్ట్ చేసేందుకు అంగీకరించారు. సెకండాఫ్‌లో వార్నర్ పాత్ర కనిపిస్తుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు‘ అని చెప్పుకొచ్చాడు. రాబిన్‌హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మార్చి 28నప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
IPL 2025: SRH vs RR మ్యాచ్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్.. ఈ ఇద్దరూ యమ డేంజర్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here