Share News

David Warner: డేవిడ్‌ వార్నర్‌తో మై డాక్టర్‌ భాగస్వామ్యం

ABN , Publish Date - Mar 25 , 2025 | 05:32 AM

రాబిన్‌హుడ్‌ ప్రమోషన్‌లోనూ పాలు పంచుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేవిడ్‌ వార్నర్‌, మై డాక్టర్‌ డైరెక్టర్‌ రఘునందన్‌లు హాజరయ్యారు.

David Warner: డేవిడ్‌ వార్నర్‌తో మై డాక్టర్‌ భాగస్వామ్యం

  • రాబిన్‌హుడ్‌ సినిమాతో సైతం!

హైదరాబాద్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో ప్రముఖ పెయిన్‌ రిలీఫ్‌ బ్రాండ్‌.. ‘మై డాక్టర్‌’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం.. సినిమా రంగంతోనూ జత కలిసింది. నితిన్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం.. రాబిన్‌హుడ్‌ ప్రమోషన్‌లోనూ పాలు పంచుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేవిడ్‌ వార్నర్‌, మై డాక్టర్‌ డైరెక్టర్‌ రఘునందన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డేవిడ్‌ వార్నర్‌తో రఘునందన్‌.. ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన సంస్థతో వార్నర్‌ భాగస్వామ్యానికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఆరోగ్యం, క్రీడ, వినోదం కలగలిసిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇండియన్‌ ఓటీసీ రంగానికి ఒక మైలు రాయిగా నిలవనుంది.


ఈ సందర్భంగా రఘునందన్‌ మాట్లాడుతూ ఇది బారత దేశంలోనే ఓ విశిష్టమైన భాగస్వామ్యమన్నారు. అంతర్జాతీయ స్టార్‌ క్రికటర్లతో కలిసి పని చేయడం తమకు గర్వకారణమన్నారు. డేవిడ్‌ వార్నర్‌ తమతో చేరడం వల్ల బ్రాండ్‌కు ఎనర్జీ, విజిబిలిటీ రెండూ గణనీయంగా పెరుగుతాయన్న నమ్మకం తనకుందన్నారు. కాగా.. మై డాక్టర్‌ బ్రాండ్‌.. పెయిన్‌ రిలీఫ్‌ ఆయిల్‌, క్రీమ్‌, స్ర్పే, ప్యయచచ్‌లుఉ, ఇతర ఫార్ములేషన్లు వంటి విస్తృత ఉత్పత్తులతో అనేక కుటుంబాల్లో నమ్మకాన్ని సంపాదించుకుంది. తాజాగా డేవిడ్‌ వార్నర్‌, రాబిన్‌హుడ్‌ చిత్రం క్రేజ్‌లతో ఈ బ్రాండ్‌ మరింతగా ప్రజల హృదయాలకు చేరువ కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 05:32 AM