Share News

రహదారులతోనే గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:08 PM

పూర్తి స్థాయిలో రహదారులు నిర్మిస్తేనే గ్రామీణ ప్రాం తాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.

రహదారులతోనే గ్రామాల అభివృద్ధి
రహదారి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

వంగూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : పూర్తి స్థాయిలో రహదారులు నిర్మిస్తేనే గ్రామీణ ప్రాం తాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని హైదరాబాద్‌-శ్రీశైలం ప్రధాన రహదారిలో సర్వా రెడ్డిపల్లి గేటు వద్ద రూ.35 కోట్లతో మంజూరైన రెండు వరుసల రహదారి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వంగూరులో ఉమ్మ డి పాలమూరు జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు కేవీన్‌రెడ్డి, రంగారెడ్డి, మల్లయ్య, పండిత్‌రా వు, జంగయ్య, రమే్‌ష్‌గౌడ్‌, జనార్దన్‌, మల్లయ్య పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

చారకొండ : మండలంలోని తి మ్మాయిపల్లి, దొంతుల గుట్టతం డాకు చెందిన లబ్ధిదారులకు మం జూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శనివారం రాష్ట్ర వ్యవసాయ కమి షన్‌ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, నాయ కులతో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని గైరాన్‌ తండాలో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవన నిర్మాణా లకు నిధులు కేటాయించాలని తండావాసులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాలరాంగౌడ్‌, యూత్‌ కాం గ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్‌, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు గోరేటి శివ, నాయకులు సాయికుమార్‌, గోపి పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:08 PM