Yadagirigutta: భక్తజనసంద్రం యాదగిరి క్షేత్రం
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:49 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆదివారం యాదగిరికొండ సందడిగా మారింది.

యాదగిరిగుట్ట, మార్చి23(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆదివారం యాదగిరికొండ సందడిగా మారింది. సుమారు 45వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా, ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో సందడి నెలకొంది. ప్రత్యేక దర్శనాలకు గంట, ధర్మదర్శనాలకు రెండు గంటల సమయం పట్టింది. రూ.49,28,666 ఆదాయం సమకూరినట్టు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.