Share News

Sridhar Babu: ఫ్యూచర్‌ సిటీలో మహేశ్వరం విలీనంపై సీఎంతో చర్చిస్తా: శ్రీధర్‌ బాబు

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:30 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్‌ సిటీలో విలీనం చేయాలనే జేఏసీ విజ్ఞప్తిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ఫ్యూచర్‌ సిటీలో మహేశ్వరం విలీనంపై సీఎంతో చర్చిస్తా: శ్రీధర్‌ బాబు

మహేశ్వరం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్‌ సిటీలో విలీనం చేయాలనే జేఏసీ విజ్ఞప్తిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జేఏసీ నాయకులు ఆదివారం కేఎల్లార్‌ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భవిష్యత్‌ తరాల కోసం మహేశ్వరంతో పాటు కందుకూరు మండలాన్ని కూడా పూర్తిగా ఫ్యూచర్‌ సిటీలో విలీనం చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాలు విశ్వనగరంగా మారినప్పుడు లాభం ఎంత ఉంటదో.. నష్టం కూడా అంతే ఉంటుందని ఆయన చెప్పారు.

Updated Date - Mar 24 , 2025 | 04:30 AM