Home » Duddilla Sridhar Babu
రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు చెందిన ఫ్రంటియర్ టెక్ హబ్ (ఎఫ్టీహెచ్)తో కలిసి హైదరాబాద్‌లో క్వాంటమ్ సాంకేతికతకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఓ వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.
పారిశ్రామిక అవసరాలకనుగుణంగా అన్ని రంగాల్లో తెలంగాణ యువతను నైపుణ్యవంతులైన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
కొత్త పరిశ్రమలు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడి అడ్డుకుంటున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
ఉగాది తర్వాత రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి పలకాలని కౌశిక్‌రెడ్డికి సూచించారు.
సభలో పలుమార్లు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. అయితే సీఎం మాట్లాడేటప్పుడు కాకుండా, అంతా అయిపోయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడగడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభలో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక, ఐటీ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని ఆ శాఖ మంత్రి దుద్దిశ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలనే జేఏసీ విజ్ఞప్తిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.