Share News

Minister Konda Surekha: త్వరలో ఎకో టూరిజం పాలసీ

ABN , Publish Date - Mar 26 , 2025 | 05:36 AM

తక్కువ సమయంలో ఎకో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాల ఆదాయం పెరిగేందుకు ఉచిత బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం విస్తృత ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Minister Konda Surekha: త్వరలో ఎకో టూరిజం పాలసీ

100 కోట్ల ఆదాయం దాటిన ఆలయాలను

పాలక మండళ్ల పరిధిలోకి తెచ్చాం: సురేఖ

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఎకో టూరిజం పాలసీ తీసుకురాబోతున్నామని, మంత్రివర్గం ఆమోదం తర్వాత మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. టెంపుల్‌ టూరిజం మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సులతో దేవాలయాల ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో రూ.100 కోట్ల ఆదాయం వచ్చే దేవాలయాలను పాలక మండళ్ల పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కబ్జాకు గురైన 1146 ఎకరాల దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. నెహ్రూ జూ పార్కును వేరే ప్రాంతానికి తరలించే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. ప్రభుత్వ ఆదాయంలో పది శాతం పర్యాటక రంగం ద్వారా తేవడానికి వివిధ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేసిందని, రూ.2 వేల కోట్ల నిధులు కేటాయిస్తే.. కనీసం రూ.50 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. క్రికెట్‌ అండర్‌-19 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో తెలంగాణకు చెందిన త్రిష, ధృతి ఉండగా, త్రిషకు రూ.కోటి ఇచ్చి సత్కరించారని, ధృతికి మాత్రం రూ.10 లక్షలే ఇవ్వడం ఏమిటని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ప్రశ్నించారు. ధృతి కూడా పేద కుటుంబం నుంచే వచ్చిందన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ధృతికి కూడా న్యాయం చేస్తామని సురేఖ తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 05:37 AM