Home » Telangana Assembly
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విషయంలో రగడ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా తప్పు బట్టారు. సీనియర్ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
Telangana Assembly 2024 Live Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమవడమే ఆలస్యం.. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలపై మంత్రి సీతక్క ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప.. కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదని.. ఈ ఘటనతో కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితబోధ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కార్పొరేషన్ లోన్లతో కలిసి మొత్తం లెక్కలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ రైడర్ షిప్ తగ్గిందని ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ సంస్థ సీఎఫ్ఓ ఒక్కమాట అంటే ఆయన్నీ జైల్లో పెడతానమే నియంతృత్వ ధోరణిలో ముఖ్యమంత్రి వెళ్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ రైతులు, అలాగే చర్లపల్లి జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అధ్యక్ష అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు సెటైర్లు గుప్పించారు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పెన్షన్స్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తుచేశారు.
పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు.
సభ ప్రారంభంకాగానే కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీటులో కూర్చున్నారు. విషయాన్ని గుర్తించిన మరోమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని, మీకు ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టికి తీసుకురావాలని..
ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు తగిన గౌరవం లభించడంలేదన్నారు. దక్షిణ తెలంగాణకు పూర్తి అన్యాయం జరుగుతోందని, తమ నియోజకవర్గాల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన ఐడి కార్డును చూపిస్తూ.. ఈ కార్డుకు విలువలేకుండా పోయిందని..
Telangana Assembly Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తరువాత తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.