ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jan 11 , 2025 | 01:05 AM
మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీరేణుకాఎల్లమ్మ ఆలయ నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం
ఎల్లమ్మ ఆలయ చైర్మనగా వెంకట్‌రెడ్డి
మరో 14 మంది సభ్యుల ప్రమాణం
కనగల్, జనవరి 10: (ఆంద్రజ్యోతి) మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీరేణుకాఎల్లమ్మ ఆలయ నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ పాలకమండలి సభ్యులతో ఆలయ ప్రాకార మండపంలో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ నూతన పాలక మండ లి సభ్యులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అంతకుముందు పాలకమండలి సభ్యులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది నాయకులు చైర్మనతో పాటు పాలకమండలి సభ్యులకు శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, వైస్ చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, ఆలయ ఈవో జయరామయ్య, ఎండోమెంట్ ఇనస్పెక్టర్ సుమతి, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివా్‌సగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనూ్‌పరెడ్డి, మాజీ చైర్మన్లు, దేప కరుణాకర్‌రెడ్డి, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, ముత్తయ్య, గణేష్ నాయకులు గోలి జగాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, నగే్‌షగౌడ్, శ్రీను, సైదులుగౌడ్ పాల్గొన్నారు.