సుపారీ కిల్లర్ బెయిల్ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:46 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. బీహార్‌కు చెందిన సుపారీ కిల్లర్ సుభా్‌షశర్మకు హైకోర్టు బెయిల్ మం జూరు చేయగా జామీనుదారులు నకిలీ ష్యూరిటీ పత్రాలు దాఖలుచేసి క టకటాలపాలయ్యారు.
సుపారీ కిల్లర్ బెయిల్ కోసం నకిలీ ష్యూరిటీ పత్రాలు
సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ట్విస్ట్
చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో జామీనుదారుల అరెస్ట్
మిర్యాలగూడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. బీహార్‌కు చెందిన సుపారీ కిల్లర్ సుభా్‌షశర్మకు హైకోర్టు బెయిల్ మం జూరు చేయగా జామీనుదారులు నకిలీ ష్యూరిటీ పత్రాలు దాఖలుచేసి క టకటాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వివరించారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కుమార్తె అమృతను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ 2018 సెప్టెంబరు 14వ తేదీన హత్యకు గురయ్యాడు. ప్రణయ్ మామ మారుతీరావు సుభా్‌షశర్మ అనే బీహారీ సుపారీ కిల్లర్‌తో ప్రణయ్‌ను చంపించాడని, వా రికి సహకరించిన అస్గర్‌అలీ, అబ్దుల్‌బారీ, ఎంఏ కరీం, శ్రవణ్‌కుమార్, మారుతీరావు కారు డ్రైవర్ శివతో కలిని ఏడుగురిపై పోలీసులు ఎస్సీ, ఎ స్టీ అట్రాసిటీ, హత్యకేసు కింద అరెస్టుచేసి జైలుకు పంపారు. ఏ2 సుభా ష్‌శర్మ మినహా మిగతా వారందరికి 2019లో కోర్టు బెయిల్ మంజూరు చే సింది. కేసులో ఏ1గా ఉన్న మారుతీరావు 2020 మార్చి 7వ తేదీన ఆత్మహత్య చేసుకోగా, ఏ7గా ఉన్న మారుతీరావు కారుడ్రైవర్ శివ పేరును విచారణ అనంతరం పోలీసులు చార్జిషీట్ నుంచి తొలగించారు. మిగతావారు బయటనుంచి కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు. సుభా్‌షశర్మకు గతంలో రెండుసార్లు బెయిల్ రాగా, అతను బయటకు వస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని భావించిన పోలీసులు బెయిల్ క్యాన్సిల్ చేయించి సుభా్‌షశర్మను అండర్‌ట్రయల్ ఖైదీగా జైల్లోనే ఉంచారు. సుభా్‌షశర్మ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో 2024 నవంబరు నెలలో బెయిల్ మంజూరు చేసి ముగ్గురిని జామీను ఇవ్వాలని సూచించింది. సుభా్‌షశర్మకు విడుదలకు ష్యూరిటీల కోసం చూస్తున్నారని నిందితుడి తరుఫున న్యాయవాది ద్వారా తెలుసుకున్న కేతేపల్లి మండలం కొత్తపేటకు చెందిన వంగాల సైదులు, మాడ్గులపల్లి మండలం పాములపాడు చింతచర్ల దేవయ్య, అదే గ్రామానికి చెందిన ముక్కాముల మల్లే్‌షలు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో జామీను పత్రాలు ఇచ్చారు. ష్యూరిటీలపై వెరిఫికేషన చేయమని కోర్టు పోలీసులను ఆదేశించడంతో ష్యూరిటీ పత్రాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
నకిలీ స్టాంపులు తయారు చేయించి
వంగాల సైదులు మిగతా ఇద్దరు దేవయ్య, మల్లే్‌షలతో కలిసి సూర్యాపేటలో ఖాళీ ష్యూరిటీ పత్రాలు కొని పాములపాడు గ్రామపంచాయితీ కార్యాలయ ముద్రలను తయారు చేయించి నకిలీ పత్రాలు (వాల్యూ సర్టిఫికెట్) నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై పాములపాడు గ్రామపంచాయతీ కార్యదర్శి మాడ్గులపల్లి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి భారత న్యాయ సంహిత సెక్షన 61(2), 318(4), 336(3), 304(2) కింద శనివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. చీటింగ్‌కు పాల్పడిన ముగ్గురు జామీనుదారులను అరెస్ట్ చేసి వారి వద్ద రెండు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన, యాక్టివా స్కూటీ, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. కేసు దర్యా ప్తు చేసి నిందితులు పట్టుబడేలా చేసిన రూరల్ సీఐ కె.వీరబాబు, మాడ్గులపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బందిని డీఎస్పీ రాజశేఖర్‌రాజు అభినందించారు.
వంగాల సైదులపై 21 కేసులు
ప్రణయ్ హత్యకేసులో నిందితుడైన సుభా్‌షశర్మకు నకిలీ ష్యూరిటీ పత్రా లు కోర్టుకు అందజేసిన కేసులో ఏ1గా ఉన్న వంగాల సైదులు గతంలో జిల్లా లో వేర్వేరు మండలాల్లో జరిగిన 21 దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.