Family Conflict : కలహాలతో పచ్చని కుటుంబం బుగ్గి
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:51 AM
వారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే దంపతులు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు సాఫీగా సాగాల్సిన సంసారంలో భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. దాంతో విసివారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే దంపతులు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు సాఫీగా సాగాల్సిన సంసారంలో భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. దాంతో విసిగి వేసారి భార్య గి వేసారి భార్య
సంసారంలో కలతలతో సాఫ్ట్‌వేర్ దంపతుల ఆత్మహత్య
ఉరేసుకుని భార్య మృతి.. అది చూసి భర్త బలవన్మరణం
అనాథలైన ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘటన
పటాన్‌చెరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): వారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే దంపతులు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు సాఫీగా సాగాల్సిన సంసారంలో భార్యాభర్తల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. దాంతో విసిగి వేసారి భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా అది చూసి భర్త కూడా అదే రీతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు అమీన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. వరంగల్‌కు చెందిన సందీప్ (30) అదే జిల్లా పరకాలకు చెందిన కీర్తి (26)కి ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వీరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ అమీన్‌పూర్‌లోని బంధకొమ్ము శ్రీధాంహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల పాప, 14 నెలల బాబు ఉన్నారు. కొంతకాలంగా సందీప్, కీర్తి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పాప పుట్టినరోజు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను మియాపూర్‌లో నివాసం ఉండే అత్తగారింట్లో దింపేందుకు సందీప్ వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి హాల్‌లో కీర్తి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. ఏం చేయాలో పాలుపోక సందీప్ కూడా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఆసుపత్రికి తరలించారు. మనస్ఫర్ధలతోనే దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.