రైతు భరోసా ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:44 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా హామీని వెంటనే అమలు చేయాలని, ఎకరాకు రూ.15వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు
కందనూలు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా హామీని వెంటనే అమలు చేయాలని, ఎకరాకు రూ.15వేలు చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం వానాకాలం ముగిసి యాసంగి కాలం వచ్చినా ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా చెల్లించలేదని పేర్కొన్నా రు. ఇప్పటికైనా ప్రభు త్వం రైతులకు ఎకరాకు రూ.15వేలు రైతు భరో సా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, దేశ్యనాయక్, ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాసులు, నరసింహ, డి.ఈశ్వర్, పొదిల రామయ్య, మల్లేష్, శంకర్‌నాయక్, శివవర్మ, కొంపల్లి అశోక్, నాగరాజు, దశరథం, బాలస్వామి, తారాసింగ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.