Share News

అనర్హులకు రైతు భరోసా అందకూడదు

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:57 AM

నల్లగొండ టౌన, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అర్హులం దరికీ రైతు భరోసా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

 అనర్హులకు రైతు భరోసా అందకూడదు

నల్లగొండ టౌన, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అర్హులం దరికీ రైతు భరోసా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం ఉదయాదిత్యాభవనలో ఆయన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శాసన మండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి తో కలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన కార్డులు మంజూరుపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి రెవెన్యూ గ్రామాల వారీగా రికార్డులు పరిశీలించి గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు నిర్వహించి భూమి లేని వారిని, భూ సేకరణ చేసిన భూములు, గుట్టలను, లే అవుట్ల, నాలా కనవర్షన చేసిన భూములను గుర్తించి వారి పేర్లను రైతు భరో సా పథకం నుంచి తొలగించాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రూ. 40 వేల కోట్లతో రైతు సంక్షేమం చేపట్టినల్లు చెప్పారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన కార్డులు మంజూరు లాంటి పథకాలు ప్రారంభిస్తామన్నారు.

బాధ్యతగా విధులు నిర్వహించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని అధికారులు విధులు బాధ్యతతో నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్‌ రెడ్డి సూచించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో 797 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మాత్రమే ఇచ్చారని కానీ ఇప్పటివరకు లబ్ధిదారులకి ఇవ్వలేదని కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేద వారి ఇంటి కల నెరవేరుస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా గుర్తించి మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్థికవేత్త, దివంగత మన్మోహన సింగ్‌ ఆలోచనతో రూపొందించినఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా కింద రెండు విడతల్లో రూ. 12వేల ఇస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు కలెక్టర్లు బాగా పనిచేస్తారని వారికి అధికారులు సహకరించి పేదల సంక్షేమం కోసం ఏ ఒక్క అర్హుడిని కూడా వదలకుండా అన్ని పథకాలు అందేలా చూడాలని అలాగే నల్లగొండ జిల్లాను ప్రఽథమ స్థానంలో ఉండేలా చూడాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, శాస న సభ్యులు బాలునాయక్‌, నల్లమాద ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ, యాద్రాది భువనగిరి, సూర్యా పేట జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హన్మంతరావు, తేజస్‌ నం ద్‌ లాల్‌ పవార్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ అమిత నారాయణ్‌, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్‌ గ్రామీణభివృద్ధి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:57 AM