ఆర్ అండ్ బీ ఈఎన్సీ అడ్మిన్‌గా తొలిసారి మహిళ!
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:13 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అడ్మిన్‌గా తొలిసారి ఓ మహిళా అధికారి నియామకమయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన ఎస్.తిరుమల..
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అడ్మిన్‌గా తొలిసారి ఓ మహిళా అధికారి నియామకమయ్యారు. ఎస్.తిరుమలను ప్రభుత్వం నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయగా.. తాజాగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
అయితే శాఖలో సర్వీస్ రూల్స్ ఇంకా తేలకపోవడంతో తిరుమల ఇన్‌చార్జ్ ఈఎన్సీగానే బాధ్యతలు పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. కాగా, శాఖ బలోపేతానికి, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈఎన్సీ తిరుమల ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.