GMR Fire Training: జీఎంఆర్ ఏరో అకాడమీలో రక్షణ, అగ్నిమాపక శిక్షణ కేంద్రం
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:45 AM
జీఎంఆర్ ఏరో అకాడమీలో రక్షణ, అగ్నిమాపక శిక్షణ కేంద్రం మళ్లీ ప్రారంభమైంది. మే 14న ప్రారంభమయ్యే 9వ బ్యాచ్‌లో 24 వారాల పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పునఃప్రారంభం
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరో అకాడమీలో రక్షణ, అగ్నిమాపక శిక్షణ కేంద్రాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రారంభించారు. ఎయిర్‌క్రాప్ట్ రెస్య్కూ, ఫైర్ ఫైటింగ్ శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. 2013 నుంచి 2018 వరకు 350 మందికి శిక్షణ అందించిన ఈ కేంద్రంలో మే 14వ తేదీన 9వ బ్యాచ్ ప్రారంభం కానుంది. 24 వారాల పాటు సాగే ఈ శిక్షణలో ఆధునిక ఫైర్ ఫైటింగ్ పరికరాలతో పాటు ప్రాక్టికల్ శిక్షణ,లో అనుభవం ఉన్న అధ్యాపకులచే బోధన అందిస్తామని అధికారులు తెలిపారు. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు జీఎంఆర్ ఏఏ నిర్వహిస్తున్న 15కు పైగా భారతీయ విమానాశ్రయాలు, ఇండిగో, ఎయిరిండియా వంటి ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లతో భాగస్వామ్య ప్రయోజనాలు పొందుతారని చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందినవారిలో 90 శాతం ప్లేస్‌మెంట్ రికార్డు ద్వారా 980 మందికి పైగా ఉద్యోగాలు పొందారని జీఎంఆర్ ఏఏ అధ్యక్షుడు అశోక్ గోపీనాథ్ తెలిపారు.