Share News

వేడుకలు నిర్వహించడం సంతోషం

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:05 PM

జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో శనివారం ముందుస్తు నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.

వేడుకలు నిర్వహించడం సంతోషం
లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో సంక్రాంతి సంబురాలను తిలకిస్తున్న ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి

- సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌టౌన్‌, జనవరి11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో శనివారం ముందుస్తు నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యా యులతో కలిసి చిన్నారులు వేసిన రంగవల్లుల తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిం చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండగ సంప్రదాయాలు కొనసాగిస్తూ భవిష్యత్‌ తరాలు గుర్తించేలా వేడుకలు నిర్వహించం సం తోషంగా ఉందన్నారు. విద్యార్థులకు సంప్రదా యాలపై అవగాహన కలుగుతుందన్నారు. కా ర్యక్రమంలో కౌన్సిలర్లు తీగల సునేంద్ర, కొత్త శ్రీ నివాసులు, కాంగ్రెస్‌ నాయకులు రేణుబాబు, పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:05 PM