Share News

ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:46 AM

జిల్లా ఆసుపత్రిలో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు.

ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లా ఆసుపత్రిలో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. శుక్ర వారం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుత్రి ఎదుట ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భం గా రమణ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని పడకలకు అనుగుణంగా శాని టేషన్‌, ఫేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బందిని నియమించి పని చేస్తున్న వారికి పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 330 పడకలను ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 పడకలకు 45 మంది చొప్పున దాదాపు 150 మంది కార్మికులు పని చేయా లని కానీ ఆసుపత్రిలో ప్రస్తుతం 150 మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు. దీని వల్ల పని చేస్తున్న కార్మికులు, సిబ్బందిపై పని భారం పడుతోందన్నారు. గతంలో కూడా సిబ్బంది, కార్మికులు విధులను బహిష్కరించి నిరసనలు చేపడితే అధికారులు చర్చలు జరిపి 15రోజులలో సిబ్బందిని నియమిస్తా మని హామీనిచ్చారన్నారు. ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా సిబ్బంది నియామకాలు జరగలేదని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినెలా 5వ తేదిన వేత నాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పూర్తిస్థాయిలో వేతనాలు అందించా లని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో కార్మి కులు, సిబ్బందికి రెస్టు రూం ఏర్పాటు చేయా లని పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఐడీ కార్డులు అందజే యాలని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు చేపడతామ న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు బెజుగం సురేష్‌, ఆసుపత్రి కార్మి కులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:46 AM