Share News

శుక్రవారం సభలో అన్ని సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:51 PM

మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం నిర్వహించే సభ వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రామడుగు మండలం కొక్కెరకుంటలో శుక్రవారం సభ నిర్వహించారు.

 శుక్రవారం సభలో అన్ని సమస్యలకు పరిష్కారం
చంటిపాపకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న కలెక్టర్‌

రామడుగు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం నిర్వహించే సభ వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో రామడుగు మండలం కొక్కెరకుంటలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లా డుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని, సభానంతరం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలు ఉచితం గా నిర్వహిస్తున్నామని, వీటిని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చంటి పిల్లల కు పౌష్టికాహారం అందించారు.కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంపీడీవో ఆర్‌ రాజేశ్వరి, మండల ప్రత్యేక అధికారి అనిల్‌, ఎంపీవో శ్రావణ్‌ కుమాఱ్‌, సీడీపీవో నిర్సంగరాణి, సెక్రటరీ విజయలక్ష్మీ, వైద్యాధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌ : దివ్యాంగులకు జారీ చేయనున్న యూడీఐడీ కార్డుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, వారికి వసతులు కల్పించాలని జిల్లా అసుపత్రి వైధ్యాధికారులను జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి ఆదేశించారు. శుక్రవారం జిల్లా జనరల్‌ ఆసుపత్రిలోని యూడీఐడీ కార్డుల వైద్యపరీక్షల విభాగాన్ని పరిశీలించారు. దివ్యాంగులకు ర్యాంపు, టాయిలెట్స్‌ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మిషనరీ టెక్నీషియన్ల కోసం ప్రభు త్వానికి ప్రతిపాదలను పంపామని తెలిపారు. ఇదివరకే సదరం సర్టిఫికెట్‌ ఉన్నవారు యూడీఐడీ కార్డుకు దరఖాస్తు చేయాల్సిన అవరం లేదన్నారు. వైద్య పరీక్షలకు హాజరుకావలసిన అవసరం కూడా లేదన్నారు. సదరం ఉండి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే అన్‌లైన్‌ లేదా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్‌ జారీ కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీన, డీఆర్‌డీవో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:51 PM