Share News

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:24 AM

కశ్మీర్‌లోని పహల్గాంలో దాడిని నిరసిస్తూ కరీంనగర్‌ తెలంగాణచౌక్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్‌ మాట్లాడుతూ పహల్గాం ఘటన తీవ్ర దిగ్భారంతి కలిగించిందన్నారు.

 ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

గణేశ్‌నగర్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహల్గాంలో దాడిని నిరసిస్తూ కరీంనగర్‌ తెలంగాణచౌక్‌లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్‌ మాట్లాడుతూ పహల్గాం ఘటన తీవ్ర దిగ్భారంతి కలిగించిందన్నారు. మతం అడిగి మరీ మారణకాండ సృష్టించడం దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవినాష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు తోట సాయి, సంపత్‌, అనిల్‌, అజయ్‌, పార్లమెంటు సోషల్‌ మీడియా కన్వీనర్‌ ఉప్పారపల్లి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, శశికుమార్‌, జిల్లా కార్యదర్శులు విజయ్‌, కుమార్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:24 AM