Share News

సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్‌ దృష్టి

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:33 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది.

సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్‌ దృష్టి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకవెళ్ళాలని భావిస్తోంది. జూన్‌, జూలై మాసాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్ని కలకు పార్టీని గుజరాత్‌ మోడల్‌లో సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటే పార్టీకి డోకా ఉండదని భావిస్తున్న పార్టీ పెద్దలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మే 20వ తేదీ నాటికి డీసీసీ అధ్యక్షులు, మే నెలాఖరు వరకు గ్రామ, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల నియామకాలు పూర్తి చేసేందుకు జిల్లాకు ఇద్దరు పీసీసీ అధ్యక్షులను నియమించారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్‌ నియమితులైన నాటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పని తీరు, పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి అందించిన నటరాజన్‌ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. 2023 నవంబర్‌ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 15 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవ లు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్‌ కార్డుల మంజూరు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, 500 రూపాయలకే వంట గ్యాస్‌ పంపిణీ, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, తదితర పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేయ డంతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నా ప్రజల నుంచి ఆశించిన మేరకు స్పం దన రావడం లేదని, ఇందుకు కారణం సంస్థాగత నిర్మాణం లేకపోవడమేనని గ్రహించారు. పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎవరికి వారుగా దృష్టి సారించారే తప్ప ప్రభుత్వపాలన తీరు గురించి ప్రజ లకు వివరించడం లేదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పి కొట్టడంలో వెనుబడి ఉన్నారని గృహించారు. మూడేళ్ల క్రితం నియమించిన డీసీసీ అధ్యక్షులు, గ్రామ, మండల కమిటీల అఽధ్యక్షులే ఉన్నారు. ఈ కమిటీలను నియమిస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధిష్టానం భావించింది. పదిహేను రోజులుగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ ముఖ్యులతో సమావేశాలు నిర్వహిం చారు. గుజరాత్‌ మోడల్‌లో సంస్థాగత నిర్మాణం చేప ట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతా నికి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. జిల్లా పరిశీలకులుగా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేన్‌, సంగీతం శ్రీనివాస్‌ను నియమించారు. బుధవారం గాంధీ భవన్‌లో పీసీసీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో మే 20వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేస్తామన్నారు. మే నెలా ఖరులోగా గ్రామ, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల నియామకాలు పూర్తి చే,యాలని, ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు డీసీసీ సమావేశాలను నిర్వహిం చాలని మీనాక్షి నటరాజన్‌ దిశా నిర్ధేశం చేసిన విష యం తెలిసిందే. గ్రామ, మండల అధ్యక్ష పదవులకు ఐదుగురి పేర్లను, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులకు ముగ్గురి పేర్లను టీపీసీసీకి పంపించాలన్నారు. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవా లన్నారు. ఆ పేర్లను పరిశీలించి పీసీసీ ఒకరిని అఽధ్యక్షు డిగా ఖరారు చేయనుంది. గ్రామ, మండల, బ్లాక్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీల నియామకాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, ఇతరత్రా అం శాల గురించి విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత సందడి నెలకొననున్నది.

Updated Date - Apr 25 , 2025 | 01:33 AM