Share News

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:41 PM

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీఎంఎస్‌ నాయకులు

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖకు మంత్రే లేడన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పప్పుల సురేష్‌, ప్రదీప్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పసుల శ్రావణ్‌, తోర్తి శ్రీనివాస్‌, మొగిలిపాలెం తిరుపతి, సత్యం పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:41 PM