Share News

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:59 AM

బీఆర్‌ఎస్‌తోనే అభివృధ్ది, సంక్షేమం సాధ్యమవుతుందని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దావ వసంత విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లా డారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జగిత్యాల క్రైం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌తోనే అభివృధ్ది, సంక్షేమం సాధ్యమవుతుందని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దావ వసంత విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లా డారు. శాసనమండలి, శాసనసభలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల సమస్యలపై మాట్లాడడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీలు రమణతో పాటు కవిత జగితా ల ప్రాంత సమస్యలను వివరించారని వాటిని అమలుపరిచేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కొండగట్టు అంజన్న దేవాలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు సాగునీరు అందించే రోళ్ల వాగు ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్‌ 22న నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ కార్యక్రమాన్ని కార్యకర్త లు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్‌, నాయకులు వొళ్లెం మల్లేశం, రిజ్వాన్‌, దామో దర్‌రావు, శ్రీనివాస్‌, శేఖర్‌, వేణు మాధవ్‌, మోహన్‌, సాజిల్‌, పర్వేజ్‌, అలీ, గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:59 AM