సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చవద్దు..
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:28 AM
పద్మశాలీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చవద్దని ఆత్మహత్యల నివార ణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పద్మశాలీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చవద్దని ఆత్మహత్యల నివార ణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో ఇటీ వల ఆత్మహత్యలు చేసుకున్న నేతకార్మిక కుటుంబాలను పరామర్శించారు. ఆత్మ హత్యల నివారణపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పద్మశాలీ తన గుండెను కండెగా చేసి బట్టలు నేస్తూ ప్రపంచ మానవాళి తల ఎత్తుకుని తిరిగే లా చేస్తున్నారన్నారు. పద్మశాలీ చైతన్యవంతులై సామాజిక ఉద్యమాలకు నడుం బిగించాలన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీల ఆత్మహ త్యలపై సమగ్ర నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించి బాధితులకు న్యాయం చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, పద్మశాలీ ప్రతినిధులు కొక్కుల భాస్కర్, పత్తిపాక సురే ష్, రమేష్, జనార్థన్, వీరేందర్, తదితరులు పాల్గొన్నారు.