గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ‘డబుల్’ ఇళ్లు ఆలస్యం
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:34 AM
గత ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయడంలో జాప్యం వల్లె నూకపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనుల్లో జాప్యం జరు గుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 17 ( ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయడంలో జాప్యం వల్లె నూకపల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనుల్లో జాప్యం జరు గుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్ట ణంలోని లింగంపేటలో నిర్మించిన బస్తీ దవాఖా నాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపా రు. జగిత్యాల పట్టణం మెడికల్ హబ్‌గా మా రిందని మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యవంతమైన వైద్యం అందించే వీలుందన్నా రు. గత ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వ బకాయి బిల్లులను ఇప్పటి రేవం త్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివా స్, మాజీ కౌన్సిలర్లు భారతి, చుక్క నవీన్, మల్ల వ్వ, నాయకులు తురగ రాజిరెడ్డి, నర్సయ్య, కొక్కుల రమేష్ పాల్గొన్నారు.
- అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జగిత్యాల నియోజకవర్గంలో జరుతున్న పలు అభివద్ధి పనులపై పంచాయతీరాజ్, వెటర్నరీ, ఆరోగ్య శాఖ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ గురువారం సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియో జకవర్గంలో మంజూరైన బస్తీ, పల్లె దవాఖాన పూర్తి, పురోగతిపై చర్చించారు. నియోజక వర్గం లో మంజూరైన అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనుల విషయమై ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు. రాయికల్, వెల్దుర్తి, తుంగూర్, రేచపెల్లి గ్రామాల్లో పశు దవాఖాన నూతన, అదనపు పనుల విషయమై ఆరా తీశారు. పట్టణంలోని టీఆర్ నగర్‌లో నిర్మిస్తున్న బాల సదన్ నిర్మాణ పనుల పురోగతి, అదనంగా ఉన్న 75 లక్షల నిధుల వినియోగం, నియోజకవర్గానికి మంజూ రైన సీఆర్‌ఆర్ నిధులు 30 కోట్ల టెండర్ ప్రక్రియపె,ౖ జగిత్యాల మున్సిపల్‌లో ఉన్న ఐదు కోట్ల నిధులతో చేయాల్సిన పనులపై సమీక్షిం చారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్, ఈఈ లక్ష్మణ్‌రావు, డీడబ్ల్యూవో నరేష్, మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరు లు పాల్గొన్నారు.