Share News

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:09 AM

రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదన పు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ అన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదన పు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధ వారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందికి అవగహన, శిక్షణ తరగతులను నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి రాష్ట్రప్రభుత్వం అందించే మద్దతు ధరలను పొందాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యా ప్తంగా యాసంగి సీజన్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో 172 కొనుగోలు కేంద్రాలతోపాటు సింగిల్‌ విండోల ఆధ్వర్యంలో 57, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 6, మెప్మా ఆధ్వర్యంలో 6 ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయనుందన్నారు. ఈ సీజన్‌లో కొత్తగా 128సెంటర్‌లను ఐకేపీకి కేటాయించింద న్నారు. ఈ యసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను నిర్ణయించిందని, గ్రేడ్‌-ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2320 చెల్లిస్తుందని తెలి పారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు అం దుబాటులో ఉండేలా అధికారులు, నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొనుగోలు కేం ద్రాల్లో మౌలిక వసతులను కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శేషాద్రి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, డీఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:09 AM