Share News

రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:29 PM

అకాలంగా కురిసిన వర్షంతో నష్టపోయిన రైతు లు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ చిన్న మైల్‌ అంజిరెడ్డి పేర్కొన్నారు.

రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దు

ముస్తాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : అకాలంగా కురిసిన వర్షంతో నష్టపోయిన రైతు లు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ చిన్న మైల్‌ అంజిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మద్దికుంట గ్రామంలో దెబ్బతిన్న వరిపంటలు, మామడిపంటలను పరిశీలించారు. ఈసందర్భం గా అంజిరెడ్డి మాట్లాడుతూ మామిడితోట ఎకరా నికి లక్ష రుపాయలను, వరి పంట ఎకరానికిరూ రూ 30వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఒక్కసారిగా ఈదరుగాలుతో కూడిన వర్షం రావ డంతో పెద్దఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని తక్షణ సాయం అందించి రైతులకు ధైర్యాన్ని కల్పించా లన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు మెర్గు అంజా గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేశ్‌, సౌల్ల క్రాంతి, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేశ్‌, కోల కృష్ణ, మెంగని మహేందర్‌, మల్లేశం, కుడుకల జనార్ధన్‌ యాదవ్‌, కళ్యాణ్‌యాదవ్‌, చిగురు వెంకన్న, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:30 PM