Share News

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని సేకరించాలి

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:00 AM

రైతులకు ఇబ్బందులు కల్గుకుండా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రైస్‌ మిల్లర్లు తీసుకోని ధాన్యాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గోదాంలకు తరలించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులకు సూచించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని సేకరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 22 (అంధ్రజ్యోతి) : రైతులకు ఇబ్బందులు కల్గుకుండా యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రైస్‌ మిల్లర్లు తీసుకోని ధాన్యాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గోదాంలకు తరలించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ధాన్యం కొనుగోళ్లలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 241 కొనుగోలుకేంద్రాలకు 239 కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి 198 కొనుగోలు కేంద్రాలనుంచి 16 వేల 22 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేల చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీఅర్‌డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాఽయాధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌరసరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 01:00 AM