ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:37 AM
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. మంగళవారం ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 68.73 శాతం, ప్రథమ సంవత్సరంలో 56.34 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
జగిత్యాల, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. మంగళవారం ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 68.73 శాతం, ప్రథమ సంవత్సరంలో 56.34 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,137 మంది పరీక్షలకు హాజరుకాగా 2,465 మంది పాసై 78.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 2,233 మంది హాజరు కాగా 1,226 మంది పాసై 54.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 3,550 మంది పరీక్షలకు హాజరుకాగా 2,443 మంది 68.82 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,554 మంది హాజరుకాగా 996 మంది 39 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 65.88 శాతం ఉత్తీర్ణత కాగా అందులో బాలురు 49.78 శాతం, బాలికలు 86.82 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఫఒకేషనల్ ఫలితాలు ఇలా..
ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌లో 46.54 శాతం ఉత్తీర్ణత లభించగా ఇందులో బాలురు 31.23 శాతం, బాలికలు 68.43 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 803 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 529 మంది ఉత్తీర్ణులై 65.88 శాతం ఫలితాన్ని సాధించారు. ఇందులో బాలురు 454 మంది పరీక్షలకు హాజరు కాగా 226 మంది ఉత్తీర్ణులై 49.78 శాతం, బాలికలు 349 మంది పరీక్షలకు హాజరుకాగా 303 మంది ఉత్తీర్ణులై 86.82 శాతం పలితాన్ని సాధించారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌లో 969 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 451 మంది ఉత్తీర్ణులై 46.54 శాతం ఫలితాన్ని సాధించారు. ఇందులో బాలురు 570 మంది పరీక్షలకు హాజరు కాగా 178 మంది ఉత్తీర్ణులై 31.23 శాతం, బాలికలు 399 మంది పరీక్షలకు హాజరుకాగా 273 మంది ఉత్తీర్ణులై 68.43 శాతం పలితాన్ని సాధించారు.
ఫపెరిగిన ఉత్తీర్ణత శాతం..
జిల్లాలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గత యేడాది కంటే ప్రస్తుత యేడాది 4.65 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ద్వితీయ సంవత్సరంలో గత విద్యా సంవత్సరం కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4.4 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా 18వ స్థానాన్ని, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా 25వ స్థానంలో ప్రథమ సంవత్సరం ఒకేషనల్ కోర్సులో 33వ స్థానంలో నిలిచింది. గత యేడాది జగిత్యాల జిల్లాలో ద్వితీయ సంవత్సర ఫలితాలు 64.29 శాతం కాగా ప్రస్తుతం 68.73 శాతం సాధించింది. ప్రథమ సంవత్సరంలో గత యేడాది 51.69 శాతం ఫలితాలు సాధించగా ప్రస్తుత యేడాది 56.34 శాతం ఫలితాన్ని జిల్లా కైవసం చేసుకుంది. గత యేడాది ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 44.15 శాతం ఫలితాలు రాగా ప్రస్తుత యేడాది 46.54 శాతం, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో గత యేడాది 55.89 శాతం ఫలితాలు రాగా ప్రస్తుత యేడాది 65.88 శాతం ఫలితాన్ని సాధించింది.
ఫరీ కౌంటింగ్ ఫీజుకు ఈనెల 30 వరకు అవకాశం
విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా, ఎటువంటి అనుమానాలున్నా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు నిర్ణీత ఫీజు చెల్లించి ఫలితాలు నిర్ధారించుకోవడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఫీజు చెల్లించిన విద్యార్థులు స్కాన్డ్ జవాబు పత్రాలు పొందవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెల 22వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ విద్యాధికారి బొప్పరాతి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.