భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:14 AM
గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చర్చ్‌లలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు చెప్పిన ఏడు వాక్యాలను గుర్తుకు తెచ్చుకుని ఆధ్యాత్మిక భావంతో పులకరించిపోయారు. బైబిల్ పఠనాలు, ప్రార్థనలతో పాటు క్వాయర్స్ బృందం గీతాలు ఆలపించి జీసస్‌పై భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఉపవాస దీక్షలను విరమించి దాన ధర్మాలు చేశారు. బహుమతులను పంచారు.
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చర్చ్‌లలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు చెప్పిన ఏడు వాక్యాలను గుర్తుకు తెచ్చుకుని ఆధ్యాత్మిక భావంతో పులకరించిపోయారు. బైబిల్ పఠనాలు, ప్రార్థనలతో పాటు క్వాయర్స్ బృందం గీతాలు ఆలపించి జీసస్‌పై భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఉపవాస దీక్షలను విరమించి దాన ధర్మాలు చేశారు. బహుమతులను పంచారు.
ఫ సీఎస్‌ఐ వెస్లీ కేథడ్రల్ చర్చ్‌లో..
సీపి కార్యాలయం వద్ద సీఎస్‌ఐ వెస్లీ కేథడ్రల్ చర్చ్‌లో పాస్టరేట్ చైర్మన్ ఆర్ పాల్ కొమ్మాలు సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో ప్రెస్బిటర్ మధుమోహన్, కార్యదర్శి సీహెచ్ దేవదాసు, వర్జర్ ఎస్ ప్రేమ్‌కుమార్, ట్రెజరర్ జి నిల్సన్, పాస్టరేట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫ సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చ్‌లో..
క్రిస్టియన్ కాలనీలోని సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చ్‌లో ఫాస్టరేట్ చైర్మన్ ఎస్ జాన్ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రెస్బిటర్ ఎం పింటు, కార్యదర్శి సి నారాయణ, కోఽశాధికారి సంజయ్‌కుమార్, పాస్టరేట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫ జ్యోతీనగర్‌లోని లూర్దుమాత చర్చ్‌లో ఫాదర్ తుమ్మ సంతోష్‌రెడ్డి సందేశమివ్వగా చర్చ్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు డి ఇన్నారెడ్డి, బి జార్జిరెడ్డి, కార్యదర్శి మరియకుమార్, సభ్యులు జరోంరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, కోటి, ఇన్నారెడ్డి, సునీల్‌రెడ్డి, గోపు రవి పాల్గొన్నారు. జగిత్యాల రోడ్, బేతేలు చర్చ్‌లో ప్రార్థనలు నిర్వహించారు.