Share News

శుభప్రదం విశ్వావసు నామసంవత్సరం

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:10 AM

తెలుగు నూతన సంవత్సరం విశ్వావసుకు స్వాగతం పలుకుతూ ఆది వారం రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఉగాది వేడకల ను ఘనంగా జరుపుకున్నారు. మామిడి తోరణాలు, భక్షాలు, పచ్చడి, పిండి వంటలతో ఇళ్లు కళకళలాడాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.

శుభప్రదం విశ్వావసు నామసంవత్సరం
సిరిసిల్ల మార్కండేయ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం చేస్తున్న పద్మబ్రాహ్మణులు

- నేతన్నలకు, అన్నదాతలకు మంచి రోజులే

- జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు

- ఉల్లాసంగా పంచాంగ శ్రవణాలు

సిరిసిల్ల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తెలుగు నూతన సంవత్సరం విశ్వావసుకు స్వాగతం పలుకుతూ ఆది వారం రాజన్నసిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఉగాది వేడకల ను ఘనంగా జరుపుకున్నారు. మామిడి తోరణాలు, భక్షాలు, పచ్చడి, పిండి వంటలతో ఇళ్లు కళకళలాడాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. జిల్లాలోని దేవా లయాల్లో ఎంతో ఉల్లాసంగా పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో మార్కండేయ, లక్ష్మీవేం కటేశ్వరస్వామి, వాసవి కన్యకాపరమేశ్వరీ, హనుమాన్‌ దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరిగాయి. పలుసం స్థల ఆధ్వర్యంలో కవి సమ్మేళనాలు నిర్వహించారు. సిరిసిల్ల మార్కండేయ దేవస్థానంలో విశ్వావసు నామ సంవత్సరంలో కలిగే ఫలితాలను పంచాంగ శ్రవణం ద్వారా వేద పండితులు వివరించారు. వేద పండితులు కోట లక్ష్మీనర్సయ్య, కోడూరి విజయ్‌భాస్కర్‌, తేల్ల ప్రవీణ్‌ శర్మ, పాశికంటి కృష్ణహరి, కోడూరి విద్యాసాగర్‌ శర్మ రాశిఫలాలను వివరించారు. విశ్వావసు నామ సంవత్స రంలో మంచి ఫలితాలు ఉంటాయని, వర్షాలు సమృద్ధి గా పడుతాయని సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు మెరగువుతాయని, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతారని తెలిపారు. కృష్ణ పక్షంలో సంక్రమణం జరగడం వల్ల సుభిక్ష, క్షేమ, ఆరోగ్యాలు కలుగుతాయని వివరించారు. పంచాంగ శ్రవణంలో పట్టణ ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘం ప్రతినిధు లు, పాల్గొన్నారు. సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వేద పండితులు రేపాక రాజుశర్మ పంచాంగ శ్రవణం చేశా రు. జిల్లాకేంద్రంలోని హనుమాన్‌, ఇతర దేవాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయంలో పంచాంగ శ్రవణం..

వేములవాడ కల్చరల్‌ (ఆంధ్రజ్యో తి): విశ్వావసు నామ సంత్సరంలో అన్నివర్గాల ప్రజలు అంత శుభమే జరుగుతుందని రాజన్న ఆలయ ప్ర ధాన అర్చకుడు చంద్రగరి శరత్‌శర్మ తెలిపారు. ఉగాది నూతన సంవత్స రాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయ ఓపెన్‌ స్లాబ్‌లో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ హజరై జ్యోతిప్రజ్వలన చేసి అర్చకులను ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలం దరికి మంచి జరగాలను, అందరికి ఆయురారోగ్యాలు అందించి, పాడిపంటలు, పిల్లపాపలను చల్లంగా చూడా లని దేవుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు రాజన్న ఆలయానికి వీచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. రాజన్న ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌ రాజన్నప్రసాదాన్ని అందజేశారు.

Updated Date - Mar 31 , 2025 | 01:10 AM