రోడ్డును ఇంకెంత విస్తరిస్తారు?
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:25 AM
ఇప్పటికే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయామని, ఇప్పుడు మళ్లీ విస్తరణ పేరిట కొలతలు వేయడం ఎంతవరకు సమంజసం అని వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని ప్రజలు అధికారులను ప్రశ్నించారు.
వేములవాడ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటికే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయామని, ఇప్పుడు మళ్లీ విస్తరణ పేరిట కొలతలు వేయడం ఎంతవరకు సమంజసం అని వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని ప్రజలు అధికారులను ప్రశ్నించారు. వేములవాడ మూలవాగు వంతెన నుంచి రెండో బైపాస్ రోడ్డులో కబరస్థాన్ వరకు రహదారి విస్తరణ కోసం నాలుగు శాఖల అధికారుల బృందం కొలతల సేకరణ చేపట్టింది. మూలవాగు వంతెన అమరవీరుల స్తూపం జంక్షన్ అభివృద్ధి, మొదటి, రెండో బైపాస్ రోడ్లలో అవసరం మేరకు రహదారి విస్తరించాలని ప్రతిపాదించిన అధికారులు రెండో బైపాస్ రహదారిలో వాహనాల రాకపోకలకు అనుగుణంగా సూపర్ మార్కెట్ వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు కొలతల సేకరణ ప్రారంభించారు. దీంతో రెండో బైపాస్ రహదారి విస్తరణ సమయంలోనే భూములు కోల్పోయామని మరోసారి విస్తరణ పేరిట భూములు తీసుకుంటారని అధికారులపై స్థానికులు అధికారు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దుకాణాలను కొలతలు వేస్తే ఊరుకోబోమని, అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తూ దాదాపు రెండు గంటల పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ఆర్డీవో రాజేశ్వర్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించా రు. ప్రస్తుతం అంచనాలు మాత్రమే రూపొందిస్తున్నామని సహకరిం చాలని కోరారు. తాజా అలైన్‌మెంట్‌లో భాగంగా 100 అడుగుల మేర కు కొలతలు వేస్తుండడంతో తమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన తో అధికారులు తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.