ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకోవాలి
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:23 AM
ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
వీర్నపల్లి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండా గ్రామంలో గ్రౌండింగ్ పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మ్యాపింగ్ ప్రకా రం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచిం చారు. నిర్మాణాలు చేపట్టిన వారికి 4 విడతలుగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లా లో పనులు చేపట్టిన వారికి విడుతలవారీగా ప్రభుత్వ ఆర్థి క సహాయం అందిందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలలో సమస్యలు తలెత్తితే అధికారులను సంప్రదించాలన్నారు. అంతకుముం దు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ భవనంలో అన్ని వసతులు ఏర్పాటుచేసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించాలి
వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యం అందిస్తున్న ఓపీ రిజిష్టర్, సిబ్బంది రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్‌లో ఉన్న వ్యాక్సిన్ గడువు తేదీ ని తనిఖీచేశారు. అనంతరం కుక్క కాటుకు గురైన యస్వంత్, ఇటీవల డెలివరీ మహిళ జ్యోతితో కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించారా.. లేదా.. స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకున్నానని జ్యోతి సమాధానం చెప్పడంతో సర్కారు దవాఖానాలో ప్రసవాలు జరిగేలా ఆరోగ్య సిబ్బంది ఎందుకు అవగాహన కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలకు జిల్లా ఆస్పత్రిలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు.
నాణ్యమైన భోజనం పెడుతున్నారా...
వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేసి, నాణ్యమైన భోజనం పెడుతున్నారా.. అని విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని, స్టోర్ రూంలో ఉన్న సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. పా ఠశాల భవనం పైకి ఎక్కి గదులను పరిశీలించారు. అదే సమయంలో తేనెటీగలు కలెక్టర్, అధికారులపై దాడి చేశాయి. అధికారుల అప్రమత్త తతో ఎవరికి ఇబ్బంది కలగలేదు. ఆయన వెంట గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీవో శేషాద్రి, ఎమ్మార్వో ముక్తార్‌పాషా, ఎంపీడీవో అబ్దుల్‌వాజిద్, ఎంఈవో శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, వైస్ చైర్మన్ లక్ష్మణ్, వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.